క‌రోనా వైర‌స్ సృష్టించిన విప‌త్క‌ర ప‌రిస్థితుల్లోనూ తెలంగాన రాష్ట్రం త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంది. ఇంత‌టి క‌ష్ట‌కాలంలోనూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బాండ్లు బహిరంగ మార్కెట్‌లో హాట్‌కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థికపరంగా అత్యంత సంక్లిష్ల ప‌రిస్థితులు నెలకొన్ని విష‌యం తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ ప‌లు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తెలంగాణ బాండ్లను తక్కువ వడ్డీకే కొనేందుకు ముందుకు రావ‌డం గ‌మ‌నార్హం. ఈ బాండ్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం మరో రెండువేల కోట్లను సమకూర్చుకున్నట్టు తెలుస్తోంది.

 

తెలంగాణ బాండ్లను కొనుగోలు చేయడానికి పలు పేరున్న కంపెనీలు, ఆర్థిక సంస్థలు ముందుకొచ్చాయి. గత నెలలో రెండు దఫాలుగా జరిగిన బాండ్లవేలం ద్వారా రూ. 4వేల‌ కోట్లు సమకూరాయి. తాజాగా జరిగిన వేలంలోనూ బాండ్లకు మంచి గిరాకీ రావ‌డం గ‌మ‌నార్హం. వచ్చే  ఐదేండ్ల కాలానికి బాండ్లను వేలంవేశారు. తెలంగాణ బాండ్లకు సంవత్సరానికి 5.82శాతం వడ్డీకే రుణాలివ్వడానికి ఆర్థిక సంస్థలు ముందుకురావడం గ‌మ‌నార్హం. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: