కొద్దిరోజులుగా టాలీవుడ్ సెల‌బ్రిటీలు అన్నీ షాకింగ్ న్యూస్‌లు చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం దిల్ రాజు రెండో పెళ్లి అంద‌రికి షాకింగ్‌గా మారింది. గ‌త ఆదివారం ఆయ‌న రెండో వివాహం చేసుకున్నారు. ఇక నిన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌గా ఉన్న మ‌న భ‌ళ్ళాల‌దేవుడు ప్రేయ‌సి వ‌ల‌లో ప‌డ్డ‌ట్టు చెప్పి అంద‌రినీ ఆశ్చ‌ర్యంలో ముంచెత్తాడు. త్వ‌ర‌లోనే మిహీక‌ బజాజ్‌ని వివాహం చేసుకోనున్నాడు. ఇక ఈ విష‌యం తెలియ‌గానే.. ప‌లువురు ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌ల వెల్లువ కురిపించారు. నిన్న టాలీవుడ్‌లో రానా న్యూసే వైర‌ల్‌గా మారింది. ఇక హీరో నాని కూడా స్పందించాడు.

 

అంద‌రిలాగాకుండా.. కాస్త ఫ‌న్నీగా వారికి విషెస్ అందించాడు.  ఈ 2020 సంవత్సరంలో ఇంకా ఏమేమి చూడాల్సి వస్తుందోనంటూ ట్వీట్ చేశారు. 'హమారా బజాజ్' అంటూ సాగే పాత వాణిజ్య ప్రకటన ఎంతో పాపుల‌ర్‌. ఆ వీడియోను  అంకితం చేస్తున్నానని అన్నాడు. ఎందుకీ దీనిని ఎంచుకున్నాడంటే.. రానా పెళ్లాడబోతున్న అమ్మాయి ఇంటిపేరు 'బజాజ్' (మిహీక బజాజ్) కావడంతో నాని ఆ ప్ర‌క‌ట‌న‌కి సంబంధించిన వీడియో షేర్ చేశాడు. ఈ ట్వీట్ వైర‌ల్ అవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: