కరోనా టీకా... ఎప్పుడు వస్తుందా అని ప్రపంచ దేశాలు అన్నీ కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాయి. అసలు ఎప్పుడు వస్తుంది అనేది చెప్పడం చాలా కష్టంగా కూడా ఉంది. అప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది అని చెప్పినా ఎప్పుడు వస్తుంది అనేది పరిక్షలు విజయవంతం అయితే మినహా చెప్పలేము. 

 

ఈ తరుణంలో బ్రిటన్ ప్రధాని బొరిన్ జాన్సన్ కీలక వ్యాఖ్యలు చేసారు. తాజాగా అక్కడ లాక్ డౌన్ మార్గదర్శకాలను ఆయన విడుదల చేసారు. ఈ సందర్భంగా ముందు మాట ఒకటి రాస్తూ కరోనా కు వ్యాక్సిన్ ఒక ఏడాదిలో రావొచ్చు లేదా అసలు రాకపోవచ్చు అని ఆయన పేర్కొన్నారు. ఆయనకు కరోనా సోకగా నెల రోజుల పాటు దానితో పోరాడి ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: