దేశంలో ఫిబ్రవరి నెల నుంచి కరోనా కేసులు నమోదు కావడం మొదలయ్యాయి. అప్పటి  నుంచి కరోనా మహమ్మారిని అదుపు చేయడానికి ఎన్నో రకాలుగా కృషి చేస్తున్నారు.  మార్చి 24 నుంచి సంపూర్ణ లాక్ డౌన్ మొదలైంది.. అప్పటి నుంచి పరిస్థితులను బట్టి లాక్ డౌన్ పెంచుకుంటూ వస్తున్నారు. అయితే కరోనా కేసులను బట్టి గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్లుగా విభజించారు.  పరిస్థితులను బట్టి లాక్ డౌన్ ని కూడా సడలిస్తూ వస్తున్నారు.  అయితే ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విభాగాలపై దృష్టి సారిస్తున్నారు.  ఈ నేపథ్యంలో ఇప్పటికే మద్యం షాపులు తెరిచిన విషయం తెలిసిందే.  ఇప్పుడు రావాణా సౌకర్యాలపై దృష్టి సారిస్తున్నారు.

 

లాక్ డౌన్ ను తొలగించిన తరువాత కూడా భౌతికదూరం, మాస్క్ లు ధరించడం తప్పనిసరైన నేపథ్యంలో, ప్రజా రవాణాపై మల్లగుల్లాలు పడుతున్న ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు సూపర్ లగ్జరీ బస్సులను సమూలంగా మార్చాలని నిర్ణయించారు.   నేపథ్యంలో మొత్తం 36 సీట్లలో 10 సీట్లను తగ్గించి, 26 సీట్లకు కుదించారు. ప్రయాణికులు నడిచే దారిలో 8 సీట్లను అమర్చారు. అటూ, ఇటూ రెండు రెండు సీట్లుండే చోట ఒక్క సీటునే ఏర్పాటు చేశారు.  అయితే ఈ మోడల్ ను అధికారులు ఓకే చేస్తే, మిగతా అన్ని బస్సులనూ ఇలాగే మార్చేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: