ప్రపంచాన్ని ఓ వైపు కరోనా మహమ్మారి పట్టి పీడిస్తుంటే.. మరోవైను ఉగ్రమూకలు తమ పైశాచిక దాడులతో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఏ వైపు నుంచి ఎలా దాడులు జరుగుతాయో తెలియని స్థితిలో ఉన్నారు. తాజాగా ఉగ్రవాదులు మరోసారి ఆఫ్ఘనిస్థాన్‌లో రెచ్చిపోయారు. ఏకంగా ఆస్పత్రిని లక్ష్యంగా చేసుకొని జరిపిన కాల్పుల్లో 14 మంది మరణించారు. ఓ ప్రసూతి ఆసుపత్రిలోకి ప్రవేశించి విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో ఇద్దరు పసికందులు సహా 14 మంది ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమ కాబూల్‌లో జరిగిందీ దారుణం. ఆసుపత్రిలోకి చొరబడిన ముగ్గురు ఉగ్రవాదులు చికిత్స పొందుతున్న మహిళలు, అప్పుడే కళ్లు తెరిచిన పసికందులపై తూటాల వర్షం కురిపించారు.

IHG

ఈ ఘటనలో ఇద్దరు నర్సులు, 12 మంది బాలింతలు, ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. కళ్లు కూడా తెరవని చిన్నారులను నరరూప రాక్షశుల్లా ప్రాణాలు తీయడంపై పలువురు ఖండించారు.  మరో ఘటనలో 21 మంది మృతి చెందారు.

IHG

ఓ మిలీషియా కమాండర్ అంత్యక్రియల కార్యక్రమంపై ఆత్మాహుతి సభ్యుడు బాంబు దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో 21 మంది దుర్మరణం పాలయ్యారు. పశ్చిమ కాబూల్’లో జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా దేశాన్ని కుదిపేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: