ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు జూన్ చివర్లో నిర్వహించడానికి గానూ ఏపీ సర్కార్ సిద్దమవుతుంది. కరోనా కారణంగా మార్చ్ నుంచి జూన్ నెల వరకు ఆర్డినెన్స్ ద్వారా కొంత బడ్జెట్ ని ప్రవేశ పెట్టారు. ఇప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్ ని ప్రవేశ పెట్టడానికి ఏపీ సర్కార్ సిద్దమవుతుంది. మే 17 తో మూడోదశ బడ్జెట్ సమావేశం ముగుస్తుంది. 

 

మరో రెండు రోజుల్లో లాక్ డౌన్ విషయంలో ఏదోక స్పష్టత అనేది వస్తుంది. అప్పుడు దీనిపై నిర్ణయం తీసుకునే సూచనలు ఉన్నాయి. లాక్ డౌన్ ని ఏపీలో కొనసాగించాలి అనే ఆలోచనలోనే సిఎం వైఎస్ జగన్ కూడా ఉన్నారు అని తెలుస్తుంది. కేంద్రం రూ.20లక్షల కోట్ల రూపాయల ఆర్ధిక ప్యాకేజీని ప్రకటించగా దానికి అనుగుణంగా ఏపీ సర్కార్ బడ్జెట్ ప్రవేశ పెడుతుంది. జూన్ నెలతో ఓటాన్ బడ్జెట్ ముగుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: