దేశ వ్యాప్తంగా వలస కార్మికుల కష్టాలు అన్నీ ఇన్ని కాదు. ఇప్పుడు వాళ్ళు పడుతున్న కష్టం గురించి ఎంత చెప్పినా సరే తక్కువే. ఇక ఇప్పుడు ఒక వలస కార్మిక మహిళ ఇంటికి నడిచి వెళ్తూ రోడ్డు మీద జన్మనిచ్చింది. మహారాష్ట్ర నుండి మధ్యప్రదేశ్ లోని తన గ్రామానికి నడుస్తున్న గర్భిణీ రోడ్డుపైనే ప్రసవించింది. 

 

మహారాష్ట్రలోని నాసిక్ నుంచి మధ్యప్రదేశ్ సత్నా వరకు నడక ప్రారంభించగా ఆమెకు దారిలో పురిటి నొప్పులు వచ్చాయి. ప్రసవించిన తర్వాత రెండు గంటలు విరామం తీసుకుని మళ్ళీ మరో 150 కిలోమీటర్ల దూరం నడకను కొనసాగించింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు పేర్కొన్నారు. ఆ విషయం అధికారులకు ఆలస్యంగా తెలియడంతో వారి కోసం బస్ ని ఏర్పాటు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: