చెన్నైలో ఏపీకి చెందిన వ్యక్తికి కరోనా నిర్ధారణ అయింది. కోయంబేడు మార్కెట్ లో పని చేస్తున్న వ్యక్తికి మూడు రోజుల క్రితం కరోనా నిర్ధారణ అయింది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ వైరస్ భారీన పడిన ఏపీ వ్యక్తిని వైద్యులు పూర్తి చికిత్స చేయకుండానే ఇంటికి పంపించారు. బాధితునికి రెండు రోజులు చికిత్స అందించిన వైద్యులు మూడో రోజు డిశ్చార్జ్ చేశారు. పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన వ్యక్తి తనను ఇంటికి పంపడంతో... ఏపీ ప్రభుత్వం తనను కాపాడాలంటూ యువకుడు సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. 
 
పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడుకు చెందిన వ్యక్తి మే 8వ తేదీన కరోనా నిర్ధారణ అయింది. రెండు రోజులచికిత్స అనంతరం వైద్యులు 10వ తేదీన యువకుడిని డిశ్చార్జ్ చేశారు. యువకుడు కరోనా సోకినా తనను డిశ్చార్జ్ చేశారంటూ వీడియోలో ఆవేదన వెళ్లగొట్టాడు. తాను దగ్గు, జ్వరం, వాసన కోల్పోవడం లాంటి లక్షణాలతో బాధ పడుతున్నట్టు తెలిపాడు. తనకు చికిత్స అందించేలా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టాలని యువకుడు కోరాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: