పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్టైన సంగతి తెలిసిందే. పదేళ్లు వరుస ఫ్లాపులతో సతమతమైన పవన్ కెరీర్ లో గబ్బర్ సింగ్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అజ్ఞాతవాసి సినిమా తరువాత సినిమాలకు దూరమైన పవన్ ప్రస్తుతం వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో పింక్‌ రీమేక్‌ ‘వకీల్‌ సాబ్‌’ చిత్రంలో నటిస్తున్నారు. దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 
 
 
ఈ సినిమాతో పాటు పవన్ మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కనుండగా హరీష్ శంకర్ డైరెక్షన్ లో మరో సినిమా తెరకెక్కనుంది. మలయాళ నటి మానసా రాధాకృష్ణన్ ఈ సినిమాలో పవన్ కు జోడీగా నటించనుందని తెలుస్తోంది. ఈ సినిమాకు "ఇప్పుడే మొదలైంది" అనే టైటిల్ ను ఫిక్స్ చేశారని సమాచారం. గబ్బర్ సింగ్ సినిమాలోని ఒక డైలాగ్ నుంచి ఈ సినిమా టైటిల్ తీసుకున్నారని సమాచారం. అయితే ఈ టైటిల్ గురించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: