కరోనా నివారణ చర్యలపై ఏపీ సిఎం జగన్ సమీక్షా నిర్వహించారు. ఏపీలో ఎమర్జెన్సీ సేవలకు ఏ లోటు లేదని ఆయన పేర్కొన్నారు. టెలీ మెడిసిన్ కోసం కొత్త వాహనాలను కొనుగోలు చెయ్యాలని జగన్ సూచించారు. గత ప్రభుత్వం చెల్లించాల్సిన ఆరోగ్య శ్రీ బకాయిలు అన్నీ తాము చెల్లించామని జగన్ పేర్కొన్నారు. 

 

ప్రజలకు మందుల కొరత లేదని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. జులై 1 నుంచి ఏపీలో కొత్త 108 వాహనాలు వస్తాయని ఆయన పేర్కొన్నారు. ఇక చేపలు, రొయ్యల కొనుగోలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జగన్ సూచించారు. రొయ్యలను చేపలను స్థానికంగా కొనుగోలు చేసే విధంగా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. ఆరోగ్య ఆసరా పథకం విషయంలో ఏ తేడా లేకుండా చూడాలని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: