5 రోజుల క్రికెట్ టెస్ట్ క్రికెట్... క్రికెట్ లో ఒక ఆటగాడి సామర్ధ్యం అనేది పూర్తి స్థాయిలో బయటపడే ఆట టెస్ట్ క్రికెట్. ఆటగాడిని పూర్తి స్థాయిలో తీర్చిదిద్ది అత్యుత్తమ స్థాయి ఆటగాడిగా మార్చేది కేవలం టెస్ట్ క్రికెట్. ఎందరో అగ్ర శ్రేణి క్రికెటర్లు టెస్ట్ క్రికెట్ ద్వారా పైకి వచ్చిన వాళ్ళే. అలాంటి టెస్ట్ క్రికెట్ ఇప్పుడు ప్రమాదంలో ఉంది అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. 

 

తాజాగా టీం ఇండియా మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ కీలక వ్యాఖ్యలు చేసారు. టెస్ట్ క్రికెట్ ఇప్పుడు కనుమరుగు అయిపోయే స్థితిలో ఉంది అని భారత్ గనుక టెస్ట్ క్రికెట్ ని వద్దు అనుకుంటే మాత్రం టెస్ట్ క్రికెట్ కనుమరుగు అవుతుంది అని భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మినహా ఏ దేశం కూడా టెస్ట్ క్రికెట్ ని ప్రోత్సహించడం లేదని చాపెల్ అభిప్రాయపడ్డాడు. అయితే కోహ్లీ మాత్రం టెస్ట్ క్రికెట్ అత్యుత్తమ క్రికెట్ అన్నాడు అని, దీనితో టెస్ట్ క్రికెట్ బ్రతుకుతుంది అని ఆశ కలుగుతుందని పేర్కొన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: