భారత్ లో కరోనా రికవరీ రేటు 32.08 శాతంగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి హర్షవర్ధన్ వివరించారు. కాసేపటి క్రితం ఆయన మీడియా తో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు విషయాలను వెల్లడించారు. ప్రతీ పన్నెండున్నర రోజులకు ఒకసారి కేసుల రెట్టింపు ఉందని ఆయన పేర్కొన్నారు. 

 

గడిచిన 24 రోజుల్లో 9 రాష్ట్రాల్లో అసలు కేసులు ఏమీ లేవని ఆయన వివరించారు. దేశ వ్యాప్తంగా 900 కరోనా ఆస్పత్రులు ఉన్నాయని, 8, 708 క్వారంటైన్ సెంటర్లు ఉన్నాయని పేర్కొన్నారు. భారత్ లో ఇప్పటి వరకు 74 వేల 281 కేసులు నమోదు అయ్యాయని, 2,415 కరోనా మరణాలు సంభవించాయని చెప్పారు. 492 కరోనా లాబ్స్ ఉన్నాయని పేర్కొన్నారు. కేసులు పెరగకుండా లాక్ డౌన్ ని కఠినం గా అమలు చేస్తున్నట్టు ఆయన వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: