కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్... ప్రధాని మోడీ ప్రకటించిన 20 లక్షల కోట్ల బడ్జెట్ వివరాలను వెల్లడించారు. ఈ ప్యాకేజి దేశ అభివృద్దికి ఉపయోగపడుతుందని చెప్పారు. గత 40 రోజులు గా దేశంలోనే పీపీఈలను వెంటిలేటర్లను తయారు చేస్తున్నట్టు ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు. 

 

స్థానిక ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ ని కల్పించడమే తమ లక్ష్యమని ఆమె వివరించారు. పేదలు వలస కూలీలకు నేరుగా నగదు జమ చేస్తామని ఆమె పేర్కొన్నారు. ఐది మూల సూత్రాలతో ఆర్ధిక ప్యాకేజి ప్రకటించామని ఆమె చెప్పారు. 40 రోజుల్లో మన శక్తి ఏంటో ప్రపంచానికి తెలిసిందని ఆమె పేర్కొన్నారు. భారత్ స్వయంగా ఎదగాలి అనేది తమ లక్ష్యమని ఆమె వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: