లాక్ డౌన్ తర్వాత గరీబ్ కళ్యాణ్ ప్యాకేజిని ప్రకటించామని ఆమె కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. 41 వేల జనధన్ ఖాతాల్లోకి నేరుగా 52,606 కోట్లను జమ చేసామని అన్నారు. ప్రధాని ప్రకటించిన 20 లక్షల భారీ ప్యాకేజికి సంబంధించిన వివరాలను నిర్మల ఈ సందర్భంగా వివరించారు. భారత్ స్వయం వృద్ది సాధించే వరకు సంస్కరణలు కొనసాగుతాయని ఆమె పేర్కొన్నారు. 

 

జన ధన్ ఖాతాలు మొబైల్ బ్యాంకింగ్ మంచి ఫలితాలను ఇచ్చాయని నిర్మల అన్నారు. ఇవ్వాల్టి నుంచి ప్రతీ రోజు ప్యాకేజి వివరాలను ప్రకటిస్తామని ఇవాళ ఎస్ఎంఈల వివరాలను ప్రకటిస్తున్నామని చెప్పారు. ఉద్దీపన ప్యాకేజి లో భాగంగా ఈ రోజు 15 చర్యలను ప్రకటిస్తున్నామని నిర్మలా సీతారామన్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: