ప్రధాని మోదీ నిన్న ఆత్మ నిర్భర్ భారత్ ప్రకటించినప్పటి నుంచి దీని అర్థం ఏమిటో తెలుసుకోవాలని చాలామంది అనుకుంటున్నారని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఆత్మ నిర్భర్ భారత్ అంటే స్వయం ఆధారిత భారత్ అని ఆమె అన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ నినాదం దేశానికి కొత్త ఉత్తేజం వస్తుందని అన్నారు. స్థానిక ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ కల్పించాలనే లక్ష్యం ముందు ఉందని అన్నారు. 
 
నిన్న ప్రధాని మోదీ మార్గనిర్దేశం చేశారని... వివిధ శాఖలతో చర్చించాక ఈ ప్యాకేజీ ప్రకటించామని అన్నారు. గడచిన ఐదేళ్లుగా ఎన్నో సంస్కరణలు జరిగాయని చెప్పారు. సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు 3 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించారు. ఉద్దీపన ప్యాకేజీలో భాగంగా 15 ఉద్ధీపన చర్యలు ఈరోజు ప్రకటిస్తున్నామని ఆన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: