ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన 20 లక్షల కోట్ల భారీ ఆర్ధిక ప్యాకేజి వివరాలను నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఇందులో 3 లక్షల కోట్లను ఎంఎస్ఎంఈ లకు కేటాయిస్తున్నట్టు ఆర్ధిక మంత్రి వివరించారు. వాళ్ళు 12 నెలల వరకు రుణాలను చెల్లించే అవసరం లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయా పరిశ్రమల్లో ఉద్యోగుల భద్రత కల్పించడానికి  నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. 

 

ఈ ప్యాకేజి తో రెండు లక్షల చిన్న తరహా పరిశ్రమలకు మేలు చేకూరుతుంది అని అన్నారు. సూక్ష పరిశ్రమల పెట్టుబడి పరిధిని 25 లక్షల నుంచి కోటి వరకు పెంచుతున్నామని చెప్పారు. 5 కోట్ల లోపు టర్నోవర్ ఉండే కంపెనీలను కూడా సూక్ష్మ కంపెనీలు గా గుర్తిస్తున్నామని ఆమె వివరించారు. తక్షణ సాయంతో వారు ఉత్పత్తి ప్రారంభించవచ్చు అని నిర్మల పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: