ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజి వివరాలను నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఈ సందర్భంగా పలు సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 200 కోట్ల లోపు కొనుగోళ్లకు గ్లోబల్ టెండర్లను పిలవడం లేదని అన్నారు. ప్రభుత్వ కొనుగోళ్ళలో 200 కోట్ల వరకు దేశీయంగానే సేకరణ అని స్పష్టం చేసారు. 

 

తీవ్రమైన రుణ ఒత్తిడి లో ఉన్న ఎంఎస్ఈలకు 20 వేల కోట్ల నగదు లభ్యతను కేంద్రం ప్రకటించింది. చిన్న మధ్యతరహా కంపెనీలకు ప్యాకేజి లో కీలక ప్రాధాన్యత ఇచ్చారు. కరోనా తర్వాత వాణిజ్య౦ చాలా కష్టంగా ఉంటుందని నిర్మలా సీతారామన్ అన్నారు. చిన్న తరహా కంపెనీల్లో ఉద్యోగుల భద్రత చాలా కీలకమని నిర్మలా సీతారామన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: