కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడుతూ సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల్లో ఈక్విటీ పెట్టుబడుల కొరకు 50,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు తెలిపారు. ఉత్పత్తి సామర్థ్యాల పెంపు కోసం పది వేల కోట్ల రూపాయలతో ఫండ్ ఇస్తామని అన్నారు. శక్తి, సామర్థ్యం ఉన్న సూక్ష్మ, మధ్య తర్హా పరిశ్రమలు ఈ ప్యాకేజీని ఉపయోగించుకోవచ్చని తెలిపారు. సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలు స్టాక్ మార్కెట్లో లిస్ట్ కావడానికి తోడ్పాటు అందిస్తామని అన్నారు. 
 
సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు మూడు లక్షల కోట్ల రూపాయలు ప్రకటిస్తున్నామని... 12 నెలల మారటోరియంతో రుణాలు ఇస్తున్నామని తెలిపారు. సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలు తక్షణం ఉత్పత్తులు ప్రారంభించేందుకు కేంద్రం చర్యలు ఉపయోగపడతాయని అన్నారు. ఆగష్టు 2020 వరకు చిన్న సంస్థలు ఉద్యోగుల పీఎఫ్ కట్టాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. ఉద్యోగుల వాటా, కంపెనీల వాటా కేంద్రమే చెల్లిస్తుందని ఆమె తెలిపారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: