ప్రధాని మోడీ ప్రకటించిన 20 లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజి లో కేంద్ర ప్రభుత్వం... కష్టాల్లో ఉన్న చిన్న  మధ్యతరహా కంపెనీలకు అండగా నిలబడింది. ఎంఎస్ఎంఈలకు కోసం 3 లక్షల కోట్ల రుణాలను ఇస్తున్నట్టు చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఇబ్బందుల్లో ఉన్న ఎంఎస్ఎంఈలకు 20 వేల కోట్లను కేటాయిస్తున్నామని కేంద్ర౦ పేర్కొంది. 

 

ఎంఎస్ఎంఈల కోసం 50 వేల కోట్లతో ఈక్విటి ఫండ్ ని కేటాయించారు. వారి అర్హతల్లో కూడా సడలింపులు ఇచ్చారు. 200 కోట్ల వరకు కాంట్రాక్ట్లకు గ్లోబల్ టెండర్లు అవసరం లేదు. ఈపీఎఫ్ పరిధిలోకి వచ్చే వాటికి మూడు నెలల పాటు ప్రభుత్వమే పిఎఫ్ చెల్లించడం, 2500 కోట్ల ఈపీఎఫ్ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. అలాగే సూక్ష్మ కంపెనీలకు గానూ 5 కోట్ల లోపు పెట్టుబడిని నిర్ణయించింది కేంద్ర సర్కార్. ఈపీఎఫ్ లో యాజమాన్య వాటా 12 శాతం నుంచి 10 శాతానికి తగ్గించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: