ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజ్ లో భాగంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పలు వివరాలను వెల్లడించారు. ప్యాకేజ్ లో భాగంగా... చిన్న మధ్య తరహా సూక్ష్మ కంపెనీలకు కేంద్రం అండగా ఉంటుంది అని సెప్పిన ఆమె 3 లక్షల కోట్ల రుణాలను వారికి కేటాయిస్తున్నట్టు చెప్పారు. 

 

ఇక కాంట్రాక్టర్లకు కూడా ఈ సందర్భంగా ఆమె గుడ్ న్యూస్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వ కాంట్రాక్ట్ లు అన్నీ కూడా ఆరు నెలలు పెంచుతున్నామని చెప్పారు నిర్మల. ప్రస్తుతం నడుస్తున్న ప్రాజెక్ట్ లు అన్నీ కూడా ఆరు నెలల వరకు పెంచుతున్నామని వివరించారు. అలాగే మార్చ్ 25 లోపు పూర్తి చెయ్యాల్సిన రియాల్టి ప్రాజెక్ట్ ల సమయం పోడిగిస్తున్నామని చెప్పారు. కరోనా ప్రభావిత సమయాన్ని యాక్ట్ ఆఫ్ గాడ్ గా చూస్తామని ఆమె చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: