తెలంగాణాలో కల్లు అమ్మకాలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చెట్ల వద్ద కల్లు తీసి అమ్మడానికి మాత్రమే అనుమతులు ఇచ్చింది. కల్లు దుకాణాలకు అనుమతి ఇవ్వలేదు సర్కార్. ఈ మేరకు తెలంగాణా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశాలు ఇచ్చారు. కల్లు గీత కార్మికులను పోలీసులు ఇబ్బంది పెట్టవద్దు అని అయన ఆదేశాలు ఇచ్చారు. 

 

భౌతిక దూరం పాటిస్తూ కల్లు విక్రయాలను జరపాలని సూచించారు. త్వరలోనే ట్యాంక్ బండ్ పై నీరా అమ్మకాలు చేపడతామని ఆయన చెప్పారు. కాగా లాక్ డౌన్ తర్వాత మద్యం అమ్మకాలను పూర్తిగా నిలిపివేసిన తెలంగాణా సర్కార్ ఇటీవల ఆదాయ మార్గాలను దృష్టి లో పెట్టుకుని అమ్మకాలను చేపట్టింది. భారీగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి తెలంగాణా లో.

మరింత సమాచారం తెలుసుకోండి: