తెలంగాణాలో రేషన్ కార్డులను రద్దు చేసిన అంశంపై రాష్ట్ర హైకోర్ట్ లో దాఖలు అయిన పిటీషన్ పై నేడు విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్ట్ తెలంగాణా ప్రభుత్వానికి కీలక ఆదేశాలు ఇచ్చింది. గిరిజనులకు, వలస కార్మికులకు ఉచితంగా సరుకులు బియ్యం ఇవ్వాలని హైకోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. 

 

ఒక్కసారే 8 లక్షల మందికి కార్డులను ఏ విధంగా తొలగిస్తారని హైకోర్ట్ ప్రశ్నించింది. రేషన్ కార్డు లేని పేదలకు బయోమెట్రిక్ లేకుండా ఉచిత బియ్యం అందించాలి అని ఆదేశాలు ఇచ్చింది. అలాగే పేదలకు 1500 కూడా ఇవ్వాలని హైకోర్ట్ సూచించింది. పేదలు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వారి ఆర్ధిక పరిస్థితిని దృష్టి లో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచనలు చేసింది కోర్ట్

మరింత సమాచారం తెలుసుకోండి: