ఆస్కార్ వేడుక‌పై కూడా క‌రోనా ఎఫెక్ట్ ప‌డింది. క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఇప్ప‌టికే అకాడమీ రూల్స్ మారుస్తున్న‌ట్టు కొద్ది రోజులు క్రితం ప్ర‌క‌టించ‌గా, తాజాగా ఆస్కార్ అవార్డుల పండుగ‌ని వాయిదా వేయ‌బోతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. లాక్ డౌన్ వ‌ల‌న థియేట‌ర్స్ అన్నీ మూత‌ప‌డ‌డంతో ప‌లు భారీ చిత్రాలు విడుద‌ల‌కి నోచుకోలేక‌పోయాయి. ఈ నేప‌థ్యంలో ఫిబ్ర‌వ‌రిలో జ‌ర‌గాల్సిన ఆస్కార్ అవార్డుల వేడుక వాయిదా ప‌డే అవ‌కాశం ఉందంటూ ఇంగ్లీష్ మీడియా చెబుతోంది. క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి కొన‌సాగుతున్న‌ లాక్ డౌన్ కార‌ణంగా  మార్విక్, నో టైమ్ టూ డై, ములాన్, బ్లాంక్ విండో వంటి భారీ చిత్రాల‌తో పాటు ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక చిత్రాల విడుద‌ల‌ వాయిదా ప‌డింది.

 

ఇలాంటి పరిస్థితుల‌లో ఆస్కార్ వేడుక‌ని ఫిబ్ర‌వ‌రిలో జ‌ర‌ప‌డం భావ్యం కాద‌ని భావించిన అకాడ‌మీ వ‌చ్చే ఏడాది మే లేదా జూన్ నెల‌లో నిర్వ‌హించాల‌ని భావిస్తున్న‌ట్టు అంత‌ర్జాతీయ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. ఒక‌వేళ ఇదే నిజ‌మైతే 93 ఏళ్ల‌ ఆస్కార్ అవార్డ్ చరిత్ర‌లో  తొలిసారి వాయిదా ప‌డ్డ‌ట్టు అవుతుంద‌ని సినీ విశ్లేష‌కులు అంటున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: