ఓ వైపు పాక్‌లో క‌రోనా వైర‌స్ ప్ర‌భావం తీవ్ర‌రూపం దాల్చుతుండ‌గానే.. మ‌రోవైపు క్రికెట్‌పై పాక్ దృష్టి సారిస్తోంది. ఈ క్ర‌మంలో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. స్టార్‌ బ్యాట్స్‌మన్‌ బాబర్‌ ఆజమ్‌ను పాకిస్తాన్‌ వన్డే, టి20 జట్లకు కొత్త కెప్టెన్‌గా నియమించింది. సర్ఫరాజ్‌ అహ్మద్‌ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించి బాబర్‌ ఆజమ్‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించింది. టెస్టులకు మాత్రం కెప్టెన్‌గా అజహర్‌ అలీనే కొనసాగుతాడని చీఫ్‌ సెల క్టర్‌ మిస్బా ఉల్‌ హక్‌ తెలిపాడు. అదేవిధంగా 2020–21 సీజన్‌కు సంబంధించిన ఆటగాళ్ల కాంట్రాక్టు జాబితాను పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) ప్రకటించింది.

 

18 మంది ప్లేయర్ల కాంట్రాక్టులో కొత్తగా ఇద్దరికి చోటు దక్కింది. నసీమ్‌ షా, ఇఫ్తికార్‌ అహ్మద్‌ రాగా... హసన్‌ అలీ, ఆమిర్, వహాబ్‌ రియాజ్‌లకు కాంట్రాక్టు దక్కక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇక్క‌డ మ‌రొక విష‌యం ఏమిటంటే.. ఇమామ్, మాజీ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్, యాసిర్‌ షాల కాంట్రాక్టు గ్రేడ్‌ తగ్గించారు. వీళ్లంతా ‘బి’ కేటగిరీకి పడిపోయారు. ఇప్పుడు ‘ఎ’ కేటగిరీలో కొత్తగా షహీన్‌ షా అఫ్రిదికి చోటు దక్కగా మొత్తంగా ఈ గ్రేడ్‌లో ఉన్నది ముగ్గురే. మిగతా ఇద్దరు అజహర్‌ అలీ, బాబర్‌ ఆజమ్‌. ఈ కాంట్రాక్టు జూలై 1 నుంచి వచ్చే జూన్‌ దాకా అమలులో ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: