దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో తక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నా పలు రాష్ట్రాల్లో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ జిల్లాలో నిన్న 131 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. ఒక్కరోజే భారీ సంఖ్యలో కేసులు నమోదు కావడంతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. 
 
ఇండోర్ చీఫ్ మెడిక‌ల్ హెల్త్ ఆఫీసర్ ప్ర‌వీణ్ జాండియా మీడియాకు ఈ విషయాలను వెల్లడించారు. రాష్ట్రంలో నిన్న నమోదైన కేసులతో కలిపి కరోనా బాధితుల సంఖ్య 2238కు చేరింది. గడచిన 24 గంటల్లో ఒకరు మృతి చెందగా మృతుల సంఖ్య 96కు చేరుకుంది. మధ్యప్రదేశ్ సర్కార్ రెడ్ జోన్లు, కంటైన్మెంట్ జోన్లు మినహా మిగిలిన ప్రాంతాల్లో లాక్ డౌన్ నిబంధనలను సడలించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: