క‌రోనా వైర‌స్ సృష్టించిన విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో వ‌ల‌స కార్మికులు, కూలీలు విల‌విలాడుతున్నారు. లాక్‌డౌన్ కార‌ణంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న కార్మికులు సొంతూళ్ల‌కు కాలిన‌డ‌క‌న బ‌య‌లుదేరుతున్నారు. వంద‌ల కిలీ మీట‌ర్లు న‌డుస్తున్నారు. ఈక్ర‌మంలో ఇంటికి చేరుకోకుండానే ప‌లువురు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్ర‌మాదాల బారిన ప‌డి కొంద‌రు, న‌డ‌వ‌లేక తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురై మ‌రికొంద‌రు మృతి చెందుతున్నారు. మొన్న‌టి నుంచి వ‌ల‌స కార్మికుల కోసం కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేకంగా శ్రామిక్‌రైళ్ల‌ను న‌డుపుతున్నా.. వ‌ల‌స కార్మికుల కాలిన‌డ‌క మాత్రం ఆగ‌డం లేదు. రైళ్ల‌లో అవ‌కాశం ద‌క్క‌ని కార్మికులు కాలిన‌డ‌క సొంతూళ్ల‌కు వెళ్తున్నారు.

 

తాజాగా.. మ‌రో విషాద ఘ‌ట‌న చోటుచేకుంది. పంజాబ్ నుంచి బిహార్‌కు కాలిన‌డ‌క‌న ప‌లువురు కార్మికులు బ‌య‌లుదేరారు. బుధ‌వారం రాత్రి రోడ్డువెంట న‌డుచుకుంటూ వెళ్తున్నారు. ఈ క్ర‌మంలో ముజ‌ఫ‌ర్‌న‌గ‌ర్‌లో వారిని బ‌స్సు ఢీకొట్ట‌డంతో న‌లుగురు ఆరుగురు కార్మికులు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. మ‌రో న‌లుగురు తీవ్ర‌గాయాల‌పాల‌య్యారు. ఈ ఘ‌ట‌న‌తో వారి కుటుంబాలు దుఃఖ‌సాగ‌రంలో మునిగిపోయాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: