ఈ నెల 31 వరకు లాక్ డౌన్ కారణంగా తిరుమల శ్రీవారి దర్శనం నిలిపివేసిన సంగతి తెలిసిందే. వందల ఏళ్ళ తర్వాత ఈ స్థాయిలో శ్రీవారి ఆలయాన్ని ఇన్ని రోజులు మూసివేయడం ఎప్పుడు లేదు. అయితే ఇప్పుడు కొన్ని పరిస్థితులను దృష్టి లో పెట్టుకుని టీటీడీ ఇప్పుడు కొన్ని ఏర్పాట్లు చెయ్యాలని చూస్తుంది. 

 

ప్రభుత్వం అంగీకరిస్తే, త్వరలోనే ప్రయోగాత్మకంగా తిరుపతి వాసులకు మాత్రం దర్శనం ఏర్పాటు చేసే ఆలోచనలో టీటీడీ ఉంది. ఈ విషయాన్ని టీటీడీ పరిశీలిస్తుంది. ముందు ప్రయోగాత్మకంగా 5 వేల మంది భక్తులకు ప్రవేశం కల్పించే ఆలోచనలో ఉందని సమాచారం. దీనిపై పూర్తి స్థాయిలో కార్యాచరణ సిద్దం చేస్తుంది. లాక్ డౌన్ తర్వాత దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: