కరోనా మహమ్మారి ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎలా సోకుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. తాజాగా ఒక యువకుడు లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి ప్రియురాలి కోసం చెన్నై నుంచి చిత్తూరు వెళ్లాడు. యువకుడికి కరోనా నిర్ధారణ కావడంతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పూర్తి వివరాలలోకి వెళితే తమిళనాడు, తిరుపత్తూరు జిల్లా ఆంబూరులో చెప్పుల షాపు నడుపుకునే యువకుడికి చిత్తూరు గిరింపేటకు చెందిన యువతితో వివాహేతర సంబంధం ఉంది. 
 
తరచూ ఆమె కోసం యువకుడు చిత్తూరుకు వెళుతూ ఉండేవాడు. లాక్ డౌన్ వల్ల రవాణా సౌకర్యాలు ఆపివేయడంతో యువకుడు కూరగాయల లారీల్లో, ఇతర వాహనాల్లో చిత్తూరుకు వెళ్లేవాడు. తాజాగా యువకుడు లారీలో ప్రయాణించే సమయంలో పరీక్షలు చేయగా కరోనా నిర్ధారణ అయింది. అధికారులు వెంటనే తిరుపత్తూరు ఆరోగ్యశాఖాధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు యువకుడికి సన్నిహితంగా మెలిగిన 220 మందిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించినట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: