ఓ వైపు ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా విల‌య తాండ‌వం చేస్తోంది. మ‌రో వైపు ఎండ‌లు మండి పోతున్నాయి. ప్ర‌జ‌లు ఈ క‌ష్టాల‌తో ఇలా విల‌విల్లాడుతుంటే మ‌రోవైపు వాతావ‌ర‌ణం కూడా అగ‌మ్య గోచ‌రంగా క‌నిపిస్తోంది. ఇటు ఎండ‌లు మండుతున్నా అటు బంగాళా ఖాతంలో అల్ప‌పీడ‌నం పొంచి ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. ఈ క్ర‌మంలోనే అండ‌మాన్ దీవుల్లోని ప‌ర‌స‌ర ప్రాంతాల్లో ఏర్ప‌డిన ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌న ప్ర‌భావం నేప‌థ్యంలో అల్ప‌పీడ‌నం ఏర్ప‌డింద‌ని వాతావ‌ర‌ణ శాఖ స్ప‌ష్టం చేసింది.

 

ఈ ఉప‌రిత‌ల ఆవ‌ర్తన ప్ర‌భావంతో ఈ నెల 15వ తేదీన ద‌క్షిణ బంగాళా ఖాతంలో వాయుగుండం ఏర్ప‌డి ఇది క్ర‌మంగా బ‌ల‌ప‌డి 16వ తేదీ సాయంత్రానికి తుఫాన్‌గా మారే అవ‌కాశం ఉంది. ఇది త‌న దిశ‌ను బ‌ట్టి మ‌రింత బ‌ల‌ప‌డితే ఏపీలోని స‌ముద్ర తీర ప్రాంతాల్లో ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని.. ఆస్తి న‌ష్టం త‌ప్ప‌ద‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే కేంద్ర వాతావ‌ర‌ణ శాఖ ఈ తుఫాన్‌కు ఎంఫాన్ అని పేరు పెట్టింది. ఈ తుఫాన్ ప్ర‌భావంతో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు.. మెరుపుల‌తో కూడిన గాలుల‌తో పాటు కొన్ని చోట్ల వ‌ర్షాలు ప‌డ‌తాయ‌ట‌.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: