తెలంగాణాలో మూడు జిల్లాలతో సరిహద్దుని పంచుకున్న ఉన్న మహారాష్ట్ర పేరు చెప్తే ఇప్పుడు తెలంగాణా వాసులు భయపడుతున్నారు. వందల కిలోమీటర్ల సరిహద్దుని మహారాష్ట్ర తెలంగాణా పంచుకున్నాయి. అదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలతో తెలంగాణా సరిహద్దుని పంచుకుంది. దీనితో ప్రజల్లో భయం వ్యక్తమవుతుంది. 

 

తెలంగాణా సర్కార్ కఠిన నిర్ణయాలు తీసుకుని మహారాష్ట్ర నుంచి రాకుండా ఎన్ని చర్యలు తీసుకున్నా సరే పెద్దగా ఫలితం ఇవ్వడం లేదు. అటవీ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న నేపధ్యంలో అడవుల్లో నుంచి మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన వారు వస్తున్నారు. దీనితో ఇప్పుడు అధికారులు అప్రమత్తమయ్యారు. అదిలాబాద్ జిల్లా మీద ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రజలు ఎవరిని కూడా బయటకు రావొద్దని గుర్తు తెలియని వారితో మాట్లాడవద్దు అని హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: