హైదరాబాద్ లో గురువారం ఉదయం నుంచి అడవి జంతువుల హడావుడి జనాలను కాస్త ఇబ్బంది పెడుతుంది. కాటేదాన్ వద్ద జాతీయ రహదారి మీద ఒక చిరుత పులి హడావుడి ఇంకా కొనసాగుతుంది. ఇక హైదరాబాద్ నగరంలోని గోల్కొండ పరిధిలో నల్ల చిరుత పులి తిరుగుతున్నట్టు ప్రచారం జరుగింది. 

 

స్థానికులు, పోలీసులు వెంటనే అప్రమత్తమై స్థానిక అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అటవీ సిబ్బంది మానుపిల్లిని పట్టుకుంది. నల్ల చిరుత అనే భయంతో వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వడంతో వాళ్ళు వచ్చి దానిని మాను పిల్లి అని గుర్తించారు. స్థానికులకు ఎలాంటి భయం అవసరం లేదని దాన్ని తరలించామని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: