తెలంగాణాలో నేటి నుంచి రైలు కూత మొదలుకానుంది. మూడు రైళ్ళు తెలంగాణాలో తిరగనున్నాయి. వరంగల్‌ రైల్వేస్టేషన్‌లో 50 రోజుల నుంచి ఒక్క రైలు సర్వీసు కూడా తిరగడం లేదు. 50 రోజుల తర్వాత సాధారణ ప్రయాణాలు మొదలవుతున్నాయి.గురువారం రైళ్ళు మొదలవుతున్నాయి. 

 

కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించడంతో వరంగల్‌ రైల్వేస్టేషన్‌ మీదుగా  ప్రతీ రోజు దాదాపుగా 30 గూడ్స్, శ్రామిక్ రైళ్ళు తిరుగుతున్నాయి. సాధారణ ప్రయాణికులు వెళ్లడానికి గానూ... రైల్వే శాఖ తెలంగాణకు మూడు ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ కేటాయించింది. ఢిల్లీ నుంచి సికింద్రాబాద్‌, ఢిల్లీ నుంచి చెన్నై, ఢిల్లీ నుంచి బెంగళూరు రైల్వేస్టేషన్లకు రాకపోకలు సాగించే విధంగా రైల్వేశాఖ ప్రత్యేక రైలు సర్వీసులను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: