ప్రపంచదేశాలను కరోనా వైరస్ గజగజా వణికిస్తోంది. అగ్రరాజ్యం అమెరికా కరోనా ధాటికి చిగురుటాకులా వణుకుతోంది. అమెరికాలో కరోనా కేసుల సంఖ్య 14 లక్షలు దాటగా దాదాపు 85,000 మంది కరోనా భారీన పడి మృతి చెందారు. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉన్నప్పటికీ అమెరికా కరోనాను కట్టడి చేయడంలో విఫలమవుతోంది. 
 
తాజాగా అమెరికాలోని లాస్ ఏంజిల్స్ కౌంటీ జైలు ఖైదీలు జైలు నుంచి బయటకు వెళ్లాలనే ఉద్దేశంతో ఒక ప్లాన్ వేశారు. కరోనా సోకితే జైలు నుంచి విడుదల చేస్తారని భావించి ఖైదీలు కరోనా సోకిన ఖైదీల నుంచి కావాలని కరోనా అంటించుకున్నారు. ఈ విషయం జైలు అధికారులకు తెలియడంతో షాక్ అయ్యారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: