టాలీవుడ్ లో ఇప్పుడు సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఒక్క సినిమా వచ్చినా చాలు అనుకునే విధంగా ఉంది పరిస్థితి. దీనితో కొన్ని సినిమాలను ఓటీటీ ఫ్లాట్ ఫాం మీద విడుదల చేయడానికి గానూ ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా రామ్ హీరోగా వచ్చిన రెడ్ సినిమాను ఓటీటీ ఫ్లాట్ ఫాం మీద విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. 

 

దీనిపై ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టారు. ది మాస్ అప్డేట్ అంటూ ఒక పోస్టర్ ని రిలీజ్ చేస్తూ సాయంత్రం 5:15 నిమిషాలకు అంటూ పేర్కొన్నారు. దాదాపుగా ఈ సినిమాను ఆన్లైన్ లో విడుదల చేసే ఉద్దేశం తోనే ఉన్నారు అని అంటున్నారు. ఈ సినిమా గత నెలలో విడుదల కావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: