కరోనా వైరస్ నేపధ్యంలో ఇప్పుడు అందరూ తమ ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఇదే బాటలో రాష్ట్రపతి భవన్ కూడా వెళ్తుంది. ఈ నేపధ్యంలోనే స్వయం రిలయంట్ రిలయంట్ ఇండియా ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఉత్సవ సందర్భాల్లో ఉపయోగించాల్సిన ప్రెసిడెన్షియల్ లిమోసిన్ కొనుగోలును వాయిదా వేయాలని రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారు. అవసరమైన వాటికి మాత్రమే ఖర్చు చెయ్యాలని భావిస్తున్నారు. 

 

కార్యాలయ వినియోగ వస్తువుల వాడకంలో కూడా చాల వరకు తగ్గిస్తారు. ఉదాహరణకు, రాష్ట్రపతి భవన్ ఇ-టెక్నాలజీని ఉపయోగించి కాగితాల వాడకాన్ని తగ్గించి౦ది. దీని ద్వారా వ్యర్థాలను నివారించడమే కాదు... కార్యాలయాన్ని పర్యావరణ అనుకూలంగా మార్చే ప్రయత్నం చేస్తుంది. ఇంధనం వాడకాన్ని కూడా తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. అట్-హోమ్ వేడుకలు మరియు రాష్ట్ర విందులు వంటి సందర్భాల్లో ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలంకరణ ఖర్చులను కూడా అవసరం అయితేనే చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: