కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశంలోని మూడు కోట్ల మంది రైతులకు శుభవార్త చెప్పారు. సన్నకారు రైతులను దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయాలు తీసుకున్నామని అన్నారు. 3 కోట్ల మంది రైతుల రు. 4.22 ల‌క్ష‌ల కోట్ల రుణాల‌పై మారిటోరియం విధించినట్టు ఆర్థిక మంత్రి ప్రకటన చేశారు. లోను రీపేమెంట్ గ‌డువు మార్చి 31 నుంచి మే 31 వ‌ర‌కు పెంచుతున్నట్టు పేర్కొన్నారు. కిసాన్ కార్డుదారులకు 25,000 కోట్ల రుణాల రుణాలు ఇస్తామని తెలిపారు. 
 
వలస కార్మికులకు మే 13వ తేదీ నాటికి 13 కోట్ల పని దినాలు కల్పించామని ఆమె తెలిపారు. గ్రామీణ మౌలిక్ సదుపాయాల కోసం 4200 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని అన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు కోసం 6700 కోట్ల రూపాయలు రాష్ట్రాలకు వర్కింగ్ కేపిటల్ కింద కేటాయిస్తున్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: