దేశంలో కరోనా మహమ్మారి వల్ల సామాన్య ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.  నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్యాకేజీలు పేద ప్రజల కోసం తీసుకు వస్తుంది.     కరోనా విపత్తు నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీకి సంబంధించిన పలు వివరాలను వెల్లడించడానికి నిన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మీడియా సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే.   ఈ రెండో విడత ప్యాకేజి వలస కార్మికులు, వీధుల్లో విక్రయాలు సాగించేవాళ్లకు, సన్నకారు రైతులకు ఎంతో లబ్ది చేకూరుస్తుందని వివరించారు.  పట్టణ ప్రాంతాల్లోని పేదలు, నిరాశ్రయులు, వలస కార్మికులకు కూడా ప్యాకేజిలో పెద్దపీట వేశారని, వారి సంక్షేమం కోసం భారీగా కేటాయించారని నిర్మలా సీతారామన్ తెలిపారు.

 

వారి సహాయ శిబిరాలు, భోజన ఏర్పాట్ల కోసమే రూ.11,000 కోట్లు రాష్ట్రాలకు కేటాయించామని, నిత్యం మూడు పూటలా భోజనం అందించే ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. వలస కార్మికులకు ఇప్పటికే నగదు పంపిణీ చేయడం కూడా జరిగిందని ఆమె వివరించారు.  పట్టణాల్లో ఉన్న పేద ప్రజల కోసం ఈ సంక్షేమ కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగ పడతాయని నిర్మలా సీతారామన్ అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: