ఆదాయ మార్గాల్లో ప్రధానంగా ఉన్న మద్యం అమ్మకాల్లో ఇప్పుడు పలు రాష్ట్రాలు కీలక అడుగులు వేస్తున్నాయి. లాక్ డౌన్ నిబంధనల సడలింపు విషయంలో కేరళలో త్వరలోనే మద్యం అమ్మకాలను చేపడతామని ఎక్సైజ్‌ శాఖా మంత్రి టీపీ రామకృష్ణన్‌ విలేకరులతో మాట్లాడుతూ వెల్లడించారు.

 

బేవరేజ్‌ కార్పొరేషన్‌, కేరళ రాష్ట్ర వినియోగదారుల సహకార సమాఖ్య లిమిటెడ్ ఆధ్వర్యంలోని 301 లిక్కర్‌ షాపులు త్వరలోనే తిరిగి ప్రారంభమవుతాయని ఆయన పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన తేదీలు, విధివిధానాలు వెల్లడిస్తామని ఆయన వివరించారు. మద్యం అమ్మకాల సమయంలో సామాజిక ఎడబాటు నిబంధనకు విఘాతం కలిగే అవకాశం ఉంది కాబట్టి వెబ్‌పోర్టల్స్‌ ద్వారా బుకింగ్‌లు చేపట్టి టేక్‌ అవే ద్వారా మద్యం సరఫరా చేస్తామని ఆయన పేర్కొన్నారు. బార్లు, హోటళ్లలో కూడా మద్యం అమ్మకాలకు అనుమతినిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: