ఏపిలో ఇప్పుడు కరోనా కష్టంతో పాటు.. విశాఖ గ్యాస్ సమస్య కూడా మొదలైంది. ఇక ‘కరోనా’, లాక్ డౌన్ కారణంగా రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం దృష్టి సారించడం హర్షణీయమని అన్నారు శాసన స్పీకర్ తమ్మినేని సీతారాం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ..  ఆముదాలవలస నియోజకవర్గంలో దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న లైదాం ఎత్తిపోతల పథకం 75 శాతం పూర్తయిందని, మదనాపురం, అన్నంపేట, వెన్నెలవలస, తాళపత్రి, నందివాడలో లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు అనుమతులు వచ్చాయని అన్నారు.

 

 రూ.22 కోట్లతో తండ్యాం ఎత్తిపోతల పథకం ప్రారంభిస్తున్నామని అన్నారు.‘కరోనా’ కష్టకాలంలో ప్రజలను టీడీపీ పట్టించుకోలేదని, చంద్రబాబు తన మైండ్ ను పాజిటివ్ గా మార్చుకోవాలని, ముసుగు తీసి బయటకు రావాలని అన్నారు.ఈ ఎత్తిపోతల పథకం ద్వారా 2,500 ఎకరాలకు సాగునీరు అందుతుందని సంతోషం వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో నిర్లక్ష్యం చేసిన అన్ని ఎత్తిపోతల పథకాలకు నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: