రామ‌సేతు.. భార‌త్, శ్రీ‌లంక‌ను క‌లుపుతూ హిందూమ‌హాస‌ముద్రంలో నిర్మించిన బ్రిడ్జిగా హిందువులు భావిస్తుంటారు. లంక నుంచి సీత‌ను తీసుకొచ్చేందుకు ఆనాడు రాముడు నిర్మించిన వార‌ధిగా చెబుతూ ఉంటారు. అయితే.. ఎన్నో ఏళ్లుగా అనేక ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయి. అనేక వాద‌న‌లు వినిపిస్తున్నాయి. భార‌త్‌, శ్రీ‌లంక‌ను క‌లుపుతూ హిందూ మ‌హాస‌ముద్రంలో ఇప్ప‌టికీ ఆన‌వాళ్లు ఉన్నాయ‌ని ప‌లువురు ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. ఇది క‌చ్చితంగా మాన‌వ నిర్మిత‌మేన‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో దానిని జాతీయ వార‌స‌త్వ సంప‌ద‌గా గుర్తించాల‌న్న డిమాండ్ ఎప్ప‌టి నుంచో ఉంది.

 

తాజాగా.. మ‌రోసారి రామ‌సేతు అంశం చ‌ర్చ‌లోకి వ‌స్తోంది. హిందువుల గొప్ప‌ చ‌రిత్ర‌ను ప్ర‌పంచానికి చెప్పేందుకు జాతీయ, అంత‌ర్జాతీయ  వార‌స‌త్వ జాబితాలో రామ‌సేత‌ను చేర్చ‌డం ఒక్క‌టే మార్గ‌మ‌ని ప‌లువురు కోరుతున్నారు. ఇదే స‌మ‌యంలో రాజ్య‌స‌భ స‌భ్యుడు సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి కూడా స్పందిస్తున్నారు. రామ‌సేతును జాతీయ వార‌స‌త్వ సంప‌ద‌గా ఎందుకు గుర్తించ‌డం లేద‌ని ప్ర‌శ్నిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: