తెలంగాణాలో నైరుతి రుతుపవనాల రాకపై వాతావరణ శాఖ అధికారులు కీలక ప్రకటన చేసారు. వచ్చే నెల 16-24 తేదీల మధ్య రాష్ట్రంలోకి అడుగు పెడతాయని అక్కడి నుంచి విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. జర్మనీకి చెందిన పోట్‌ స్డామ్‌ ఇన్‌స్ట్టిట్యూట్‌ ఫర్‌ క్లయిమేట్‌ ఇంపాక్ట్‌ రీసెర్చ్‌ గ్రూప్‌ లీడర్‌ ప్రొఫెసర్‌ ఎలీనా సురో వ్యాట్కీనా ఈ విషయాన్ని వివరించారు. 

 

అదే విధంగా మరో కీలక ప్రకటన కూడా చేసారు. జూలైలో కొన్ని నెలల పాటు వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని అంచనా వేసారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయంలో మీడియా తో మాట్లాడుతూ దీనిపై ప్రకటన చేసారు. జూలై 15 నుంచి 3నెలల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: