హైదరాబాద్ లో చిరుత ఆచూకి తెలుసుకోవడానికి గానూ ఇప్పుడు అధికారులు నానా కష్టాలు పడుతున్నారు. ఒక పక్క కరోనా తో నానా ఇబ్బందులు పడుతున్న పోలీసులకు ఇప్పుడు చిరుత చికాకు మొదలయింది. చిరుతను పట్టుకోవడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నా సరే అది మాత్రం దొరికే అవకాశం కనపడటం లేదు. 

 

కాటేదాన్ సమీపంలో అది తప్పించుకుని పారిపోయింది. ఇక అక్కడి నుంచి ఒక ఫాం హౌస్ దగ్గరకు వెళ్ళింది అని సమాచారం. ఫాం హౌస్ దగ్గర ఉన్న చెట్లలో అది నక్కి ఉండవచ్చు అని భావిస్తున్న అధికారులు డ్రోన్ కెమెరాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఇటీవల కల్వకుర్తి ప్రాంతంలో ఒక చిరుత తప్పించుకుంది. ఇది అదే అయి ఉంటుంది అని భావిస్తున్నారు. జూ పార్క్ సిబ్బంది కూడా దానిని పట్టుకోవడానికి రంగంలోకి దిగారు.

మరింత సమాచారం తెలుసుకోండి: