లాక్ డౌన్ కారణంగా చిక్కుకుపోయిన వేలాది మంది వలస కూలీల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రామిక్ రైళ్ళను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దేశం నలుమూలలా ఈ రైళ్ళు నడుస్తున్నాయి. తాజాగా ఒక శ్రామిక్ రైలు నుంచి 167 మంది అదృశ్యం కావడం ఆందోళన కలిగిస్తుంది. గుజరాత్‌లోని సూరత్‌ నుంచి ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌కు వలస కార్మికులను తరలిస్తున్న ప్రత్యేక రైలు నుంచి 167 మంది కనపడకుండా పోయారు. 

 

అధికారుల వద్ద ఉన్న సమాచారం ప్రకారం చూస్తే మే 12 న 1,340 మంది వలస కార్మికులతో సూరత్‌ నుంచి ప్రత్యేక రైలు బయల్దేరగా హరిద్వార్‌కు చేరుకునే సమయానికి అందులో 1,173 మంది వలస కూలీలు మాత్రమే ఉన్నారని గుర్తించారు. వీళ్ళు ఎక్కడైనా దిగేసారా లేక ఏదైనా జరిగిందా అనే దాని మీద అధికారులు ఆరా తీస్తున్నారు. గుజరాత్ ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: