నియంత్రిత పంటల సాగుపై తెలంగాణా సిఎం కేసీఆర్ నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్ వాయిదా పడింది. దేశంలోనే తొలిసారిగా 20 వేల మందితో కేసీఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని భావించారు. అయితే కొన్ని కారణాలతో ఇది వాయిదా పడింది అని తెలంగాణా సర్కార్ ఒక ప్రకటన లో తెలిపింది. 

 

ప్రభుత్వం సూచించిన పంటలే సాగు చెయ్యాలని చెప్తున్న కేసీఆర్ నేడు క్షేత్ర స్థాయి అధికారులతో మాట్లాడాలి అని భావించారు. 32 కలెక్టరేట్లు, మండల కేంద్రాల్లోని 600 సెంటర్ల నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలి అని భావించారు. చెప్పిన పంటలు వేయకుంటే కఠిన నిర్ణయాలు తప్పవు అని కేసీఆర్ అంటున్నారు. అయితే వాయిదా పడటానికి ప్రధాన కారణం ఏంటీ అనేది స్పష్టంగా తెలియలేదు. త్వరలోనే ఎప్పుడు నిర్వహిస్తారు అనేది ప్రకటిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: