దేశంలో ఓ వైపు కరోనా భయంతో ప్రజలు వణికిపోతున్నారు.  ఏ క్షణంలో ఏవరికి కరానా ఎటాక్ అవుతుందో అన్న భయంతో అనుక్షణం అప్రమత్తంగా ఉంటున్నారు.  ఈ సమయంలో సామాజిక దూరం పాటించాలని.. మాస్క్ లు ధరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే.  ఇంత క్లిష సమయంలో  ఎటువంటి లాక్ డౌన్ నిబంధనలూ పాటించకుండా వేలాది మంది ప్రజలు గుంపులు గుంపులుగా కనపడిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. రామనగర జిల్లా  కొలగొండనహళ్లి గ్రామంలో నిన్న జాతర జరిపారు.

ఓ వైపు  కర్ణాటకలో కరోనా కేసులు తగ్గనే లేదు.. మరణాల సంఖ్య కూడా పెరిగిపోయింది..ఇలాంటి సమయంలో గుంపులుగా జాతర జరపడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.  ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఉత్సవాల కోసం ప్రజలు పంచాయతీ అభివృద్ధి శాఖ కార్యాలయంలో అనుమతి కూడా తీసుకున్నారు.  

ఈ జాతరకు అనుమతి ఇచ్చిన పంచాయతీ అభివృద్ధి శాఖ అధికారి ఎన్‌సీ కల్మత్‌ను రామనగర డిప్యూటీ కమిషనర్ సస్పెండ్‌ చేశారు. కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న సమయంలో ప్రజలు ఈ ఉత్సవంలో పాల్గొనడం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: