తెలంగాణాలో ఇప్పుడు పులులు చుక్కలు చూపిస్తున్నాయి. పదుల సంఖ్యలో పులులు తెలంగాణాలో తిరుగుతున్నాయి. మహారాష్ట్రలోని కవ్వాల్ అటవీ ప్రాంతం నుంచి పులులు అదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో అడుగు పెడుతున్నాయి. దట్టమైన అడవి ఉన్న కవ్వాల్ లో పులుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 

 

అదిలాబాద్, నిజామాబాద్ సహా పలు ప్రాంతాల నుంచి చిరుతలు హైదరాబాద్ లోకి అడుగు పెడుతున్నాయి. ఇప్పుడు హైదరాబాద్ నగర శివారుల్లో ఉండే ప్రజలకు పులుల భయం మొదలయింది. అదిలాబాద్ గ్రామాల్లో అయితే జనాలకు కంటి మీద కునుకు లేదు. అక్కడ పశువులను తింటున్నాయి పులులు. ప్రాణహిత పరివాహక ప్రాంతంలో వీటి సందడి ఎక్కువగా ఉందని అధికారులు చెప్తున్నారు. అటవీ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. గ్రామాల్లో కెమెరాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: