తెలంగాణాలో పదో తరగతి పరిక్షల విషయంలో స్పష్టత రావడం లేదు. విద్యార్ధుల భవిష్యత్తు ఇప్పుడు ప్రమాదకరంగా మారింది అనే వ్యాఖ్యలు ప్రభుత్వ వర్గాల నుంచి కూడా ఎక్కువగానే వినపడుతున్నాయి. దీనితో తెలంగాణా సర్కార్ ఇప్పుడు పరిక్షల నిర్వహణ విషయంలో ఏదొకటి చెయ్యాలని భావిస్తుంది.

 

ఈ నేపధ్యంలోనే తెలంగాణా సర్కార్ హైకోర్ట్ గడప తొక్కింది. విద్యార్ధుల భవిష్యత్తు ని దృష్టి లో ఉంచుకుని పదో తరగతి పరిక్షలు నిర్వహించాలని ప్రభుత్వం పిటీషన్ దాఖలు చేసింది. దీనిపై అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోర్ట్ ని విజ్ఞప్తి చేయగా ఈ నెల 19 తర్వాత విచారణ చేస్తామని పేర్కొంది కోర్ట్. కాగా ఏపీ లో ప్రభుత్వం పదో తరగతి పరీక్షలను నిర్వహించడానికి తేదీలను కూడా ఖరారు చేసిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: