బెంగ‌ళూరు న‌గ‌రం మాఫియా డాన్‌ల‌కు కేరాఫ్ అన్న విష‌యం ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ముంబై లో మాఫియా ఎలా చెల‌రేగిపోయేదో ఆ త‌ర్వాత 1990వ ద‌శ‌కంలో బెంగ‌ళూరు కూడా మాఫియా డాన్ల‌కు అడ్డాగా మారిపోయింది. 1990వ ద‌శ‌కంలో బెంగ‌ళూరు న‌గ‌రాన్ని త‌న క‌నుసైగ‌ల‌తో శాసించిన డాన్ ముత‌ప్ప రాయ్ ఈ రోజు ఉద‌యం మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న కొద్ది రోజులుగా బ్రెయిన్ క్యాన్స‌ర్‌తో బాధ ప‌డుతున్నారు. ఆయ‌న వ‌య‌స్సు 68 సంవ‌త్స‌రాలు. 

 

ఇక ఓ సాధార‌ణ గ్యాంగ్ ఉద్యోగిగా మొద‌లు అయిన రాయ్ ఆ త‌ర్వాత పెద్ద అండ‌ర్ వ‌ర‌ల్డ్ డాన్ అయ్యాడు. ఇలా 30 ఏళ్ల పాటు బెంగ‌ళూరును త‌న క‌నుసైగ‌ల‌తో శాసించారు. చివ‌ర‌కు పోలీసుల వేట మొద‌లు పెట్ట‌డంతో రాయ్ దుబాయ్‌కు పారిపోయాడు. ఆ త‌ర్వాత భార‌త ప్ర‌భుత్వం అభ్య‌ర్థ‌న కోరిక మేర‌కు ముతప్ప రాయ్ ను 2000వ సంవత్సరంలో భారత్‌కు అప్పగించింది దుబాయ్ ప్రభుత్వం. భార‌త్‌కు తిరిగి వ‌చ్చాక రాయ్ క‌ర్నాక‌ట అనే ఆర్గ‌నైజేష‌న్ స్థాపించి పేద‌ల‌కు సాయం చేశారు.

 

ఇక సౌత్ ఇండియ‌న్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి రాయ్ ఫ్యామిలీకి చాలా ద‌గ్గ‌ర బంధువు అని చెపుతారు. ఇక బాహుబ‌లి రిలీజ్ అయ్యాక అనుష్క దేశ‌వ్యాప్తంగా ఉన్న ప‌లు ఆల‌యాల‌ను సంద‌ర్శించుకున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో రాయ్ అనుష్క వెంటే ఉన్నారు. ఇక తాజాగా రామ్‌గోపాల్ వ‌ర్మ రాయ్ జీవితంపై సినిమా ఎనౌన్స్ చేసిన కొద్ది రోజుల‌కే ఆయ‌న మృతి చెందారు. రాయ్ మరణించడంతో అనుష్క ఫ్యామిలీ తీవ్ర విషాదంలో మునిగిపోయిందని అంటున్నారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: