నారా చంద్రబాబు నాయుడు తనయుడు, ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఏపీ సీఎం జగన్ పై ట్విట్టర్ ద్వారా విమర్శలు చేశారు. మోసానికి మరో పేరు సీఎం జగన్ అని అన్నారు. జగన్ మ్యానిఫెస్టోలో నవరత్నాలు అని పెద్దగా రాశారని... చివర్లో షరతులు వర్తిస్తాయని చిన్నగా రాశారని అన్నారు. జగన్ రైతు భరోసా పేరుతో రైతులను దగా చేశారని చెప్పారు. జగన్ ఎన్నికల ముందు కేంద్రం రైతులకు ఇచ్చే సహాయంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం 12,500 ఇస్తుందని చెప్పారని... ఇప్పుడు 5,000 కోత పెట్టి 7,500 ఇస్తున్నారని అన్నారు. 

 
ఒక్కో రైతన్నను జగన్ ఐదేళ్లలో 25,000 రూపాయలు దగా చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం పంటకు గిట్టుబాటు ధర కల్పించలేకపోవడం వల్ల రైతులు కన్నీరు పెడుతున్నారని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని చెప్పారు. జగన్ ఎన్నికల ముందు ప్రతి రైతుకు లక్ష రూపాయలు లబ్ధి చేకూరుస్తానని చెప్పారని... ఇప్పుడు ఆ రత్నం కూడా జారిపోయిందా...? అని ప్రశ్నించారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: