ఆంధ్రప్రదేశ్ లో రైతు భరోసా నిధులు విడుదల చేసారు ఏపీ సిఎం వైఎస్ జగన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. రైతులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు జగన్. రైతులతో ఇలా మాట్లాడటం బాధగా ఉందన్నారు ఆయన. తొలి విడతగా 7,500 కోట్లను విడుదల చేసారు జగన్. 

 

అప్పులతో సంబంధం లేకుండా రైతులకు పెట్టుబడి సాయ౦ అందిస్తున్నామని రైతుల ఖాతాల్లోకి నేరుగా నగదు జమ చేస్తామని చెప్పారు. ఈ పథకం రైతుల మధ్య ఉండి ప్రారంభించాలని భావించినట్టు జగన్ వివరించారు. రైతులు బాగుంటేనే దేశం బాగుంటుంది అని జగన్ అన్నారు. ఈ పెట్టుబడి సాయం రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని జగన్ అన్నారు. వరుసగా రెండో ఏడాది ఏపీ సర్కార్ రైతులకు భరోసా కింద సాయం అందించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: